R.HEMANTH KUMAR
? శ్రీ తలుపులమ్మతల్లి లోవ? ? భక్తుల తలపులను నెరవేర్చు తల్లిగా శ్రీ తలుపలమ్మ అమ్మవారు జగత్ ప్రసిద్ధి చెందారు. ?ఆలయాన్ని ఆనుకుని ఉన్న 2 కొండలపై నుండి నిరంతరాయంగా తియ్యటి పాతాళ గంగ ఉంటుంది. అందుకే ఈ కొండ ధారకొండగా ప్రసిద్ధి చెందింది. ? ఈ కొండలలో ఒకదానిని ధారకొండ గానూ మరొక దానిని తీగకొండ గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య తలుపులమ్మ అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. ? ఈ రెండు కొండల మధ్యలో కోటి సూర్యుల కాంతులతో కూర్చుంది ఆ చల్లని తల్లి, లోవ గ్రామంలో వెలసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు శ్రీలలితాదేవి అంశ అంటారు. ? ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ? స్థల పురాణం ?కృత యుగంలో ధీరునిగా పేరుపొందిన మేరు పర్వతుడు తన స్వరూపాన్ని పెంచుకుంటూ పోతున్న క్రమంలో అగస్త్యుడు దానిని ఆపేందుకు దక్షిణ భారత దేశ యాత్ర చేపట్టాడు. ? ఒక అరణ్య మార్గంలో వెళుతుండగా సంధ్యావందన సమయం అయింది. కాలాలలో సంధ్యావంధనం చేసుకునే అగస్త్యునికి ఆ అడవిలో ఎక్కడా చుక్క నీరు కనబడలేదు. సంధ్యావందనానికి ఆర్ఘ్యం సమర్పించాలని తలచిన అగస్త్యుడు అప్పటికే సూర్యస్తమయ దగ్గరపడటం గమనించి పాతాళగంగని ప్రార్థించాడు. అప్పుడు అగస్త్యుని ప్రార్థన విన్న పాతాళగంగ పర్వత శిఖరాల మీదుగా పెల్లుబికి ఒక లోయలోకి ప్రవహించింది. ఈ విధంగా పడ్డ పవిత్ర పాతళగంగతో అగస్త్య మహాముని సంధ్యా వందనం ఆచరించాడు. ?ఆ పుణ్య సమయంలో జగజ్జనని శ్రీ లలితాంబాదేవి అగస్త్యునికి ప్రత్యక్షమై బలహీనులు, అల్పాయువులైన మానవులను రక్షిoచేందుకు తాను ఆదిశక్తిగా ఈ అరణ్యంలో సంచరిస్తున్నానని తెలిపింది. అప్పుడు అగస్త్యుడు ఆ తల్లికి ప్రణమిల్లి భక్తులు తలుచుకున్న తడవునే కోరిన వరాలు ఇచ్చే తల్లిగా ఈ లోయలో పాతాళగంగ సమీపాన పీఠం పై వెలిసి ఉండుమని ప్రార్థించిన ఫలితంగా ఆ తల్లి తలుపులమ్మగా వెలసిందని పురాణకథ. ? కాలక్రమేణ ఆ లోయే లోవగా రూపాంతరం చెందింది. అమ్మవారి ఆలయ సన్నిధికి వచ్చే భక్తులకు తీయని నీరు లభించాలని అగస్త్యుడు కోరిన వల్లే తలుపులమ్మ పాతాళ గంగ నీటిని తియ్యటి నీరుగా మార్చింది. అమ్మవారిని దర్శించే భక్తులకు ఇప్పటికీ ఆ పవిత్ర గంగను సేవించే భాగ్యం లభిస్తుంది. ? సకల సౌభాగ్య ప్రదాత తూర్పుగోదావరి జిల్లా లోవ పుణ్యక్షేత్రంలో వేంచేసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు తనను దర్శించిన భక్తులకు, సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారు. కిరీట ధారియై శిలా రూపంలో స్వయంభువుగా శ్రీ లలితా దేవి అంశంగా అమ్మవారు కొండ గుహలో కొలువైయున్నారు. అమ్మవారి మూలవిరాట్ కు కుడిప్రక్కన అమ్మవారి సోదరుడు పోతురాజు విగ్రహాన్ని, ఎడమ వైపు అమ్మవారి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించారు. వెనుకవైపు అమ్మవారి పెద్ద ప్రతిమ పసిడి కాంతులను ప్రసరిస్తూ, కొలచిన భక్తులకు వరాలను ప్రసాదించే తల్లిగా జగన్మాతగా దర్శనమిస్తుంది. దర్శన ఫలం ?ముఖమంతా పసుపు ఛాయతో చల్లని చూపులతో దీవెనలను అందించే తలుపులమ్మ తల్లి దర్శించిన మత్తయిదువలు బ్రతుకంతా కుంకుమ కాంతులతో వర్థిలుతారు. శ్రీ తలుపులమ్మ అమ్మవారిని, దర్శిస్తే మదిలో తలపులు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. సకల సౌభాగ్యాలు ప్రసాదించే తల్లిగా అమ్మవారిని కొలుస్తారు. సంతానం లేని మహిళలు అమ్మవారిని దర్శించి ఆలయం వెనుక ఊయల సేవ... చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వాహనాల యాజమానులు, డ్రైవర్లు, తమ కొత్త, పాతవాహనాలతో లోవ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించి, వాహనపూజ చేయిస్తే ఆ వాహనాలకు అవరోధాలు ఎదురుకావని గట్టినమ్మకం. ? ట్రక్కుల యజమానులు మరియు కార్ల యజమానులు, ముఖ్యంగా గోదావరి మరియు ఉత్తర కోస్తా జిల్లాలలో నివసించే వారు ఈ ఆలయంతో ప్రత్యేక బంధాన్ని పంచుకుంటారు, ఎందుకంటే తలుపులమ్మ తల్లి తమను ప్రమాదాలు, ప్రమాదాల నుండి కాపాడుతుందని మరియు లాభాలను ఆర్జించడంలో కూడా సహాయపడుతుందని వారు బలంగా విశ్వసిస్తారు. ? ట్రక్కు యజమానులు కొండ గుడి పాదాల వద్ద గుడారాలు వేసుకుని జంతుబలి సమర్పించి, తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను గోడలపై భక్తిశ్రద్ధలతో చిత్రీకరిస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసే చాలా మంది ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించి, అమ్మవారి అనుగ్రహం పొందేలా చూసుకుంటారు. ?రాత్రి 8లేదా 9కి మూసివేసే ఇతర ఆలయాల మాదిరిగా కాకుండా, తలుపులమ్మ తల్లి ఆలయం సాయంత్రం 600 గంటలకు త్వరగా మూసివేయబడుతుంది. ఎందుకంటే కొండపై నివసించే వన్యప్రాణులు రాత్రిపూట సంచరించడం వల్ల యాత్రికులకు భద్రత లేకుండా పోయింది. తలుపులమ్మ తల్లి ఈ కొండకు రాత్రిపూట తరచుగా వస్తుందని కూడా నమ్ముతారు. ? యాత్రికుల రద్దీ ఇక్కడ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ, ఆదివారం, మంగళ, బుధ, గురువారాలు మరియు పండుగ సందర్భాలలో చాలా రద్దీగా ఉంటుంది.